Sai Dharam Tej నటించిన విరూపాక్ష(Virupaksha) సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసమే ఈ మెగా హీరో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా నటి సోనియా సింగ్ తో కలిసి సరదాగా ముచ్చటించారు. అందులో మెగా మేనల్లుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సీతారామం సినిమా తనకెంతో నచ్చిందని. అందులోని సీత పాత్రతో తాను ప్రేమలో పడ్డట్లు చెప్పారు. వాళ్ల ఇంట్లో కొంచెం చాదస్తాలు ఎక్కువగా ఉంటాయని తెలిపాడు. తుమ్మిన వెంటనే బయటకు వెళ్లకూడదంటారని.. రాత్రిపూట గోళ్లు తీయకూడదని వాళ్ల అమ్మ చెబుతుంటుందని అన్నాడు. ఇంకా శాకుంతలం విడుదల సందర్భంగా సమంత గురించి సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ గురించి ప్రశ్నించగా.. సామ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె ఓ ఫైటర్ అని అన్నాడు. ఆమెను చూస్తూ ఉంటే మాటలు కూడా రావని అన్నాడు.
ఇక సినిమాల్లోకి రాకపోతే ఏం అయ్యేవారని అడగ్గా.. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. ఎన్నో మెడల్స్ కూడా సాధించానని తెలిపాడు. అంతే కాకుండా.. నేషనల్ క్రికెట్ టీంలో కూడా తాను సెలెక్ట్ అయ్యానని మెగా హీరో వెల్లడించాడు. సినిమాలపై ఉన్న ఇష్టంతోనే క్రికెట్‌ను వదులుకున్నానని తెలిపాడు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో సాయిధరమ్(Sai Dharam Tej) మంచి టాలెంటెడ్ అని.. మరికొందరేమో కబుర్లు చెబుతున్నాడంటూ కొట్టిపారేస్తున్నారు.