Raviteja : ఏంటి హీరో రవితేజ, హీరోయిన్ సమంతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందా? వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.. వీరిద్దరికీ ఎక్కడ గొడవ మొదలైంది ? వీరిద్దరికీ ఎందుకు పడటంలేదు? కారణం ఏమైవుంటుంది? మీకేమైనా తెలుసా ? అంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్ మొత్తం ఈ విషయమే చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి వీరిద్దరినీ అజాత శత్రువులని చెప్పొచ్చు. సమంత అయితే తన దగ్గర పనిచేసేవారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. రవితేజ చాలా పద్ధతిగా నిబద్ధతతో సినిమాలు చేస్తుంటారు. ఇండస్ట్రీలో ఎవరితోను గొడవ పెట్టుకోడు. తన పనేదో అదే తాను చేసుకుపోతుంటాడు.
కొన్నేళ్ల కింద గోపీచంద్ మలినేని .. రవితేజ, శ్రుతిహాసన్ తో బలుపు సినిమాను తెరెక్కించిన సంగతి తెలిసిందే. గోపీచంద్.. రవితేజ కాంబోలో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. దీంతో పాటు బాలయ్యతో ఇటీవలే వీరసింహారెడ్డి అనే సినిమాను కూడా చేశాడు గోపీచంద్. బలుపు సినిమా చేసే సమయంలో శ్రుతిహాసన్ కు బదులుగా ముందు సమంతను తీసుకోవాలని దర్శకుడు భావించాడట. అయితే సమంత హీరోయిన్ గా అయితే నేను నటించను అని రవితేజ తెగేసి చెప్పినట్లు సమాచారం. దీనికి కారణం ఏమిటనేది డైరెక్టర్ కు కూడా రవితేజ చెప్పలేదు.
అయితే రవితేజకన్నా ముందే కథను విన్న సమంత హీరో రవితేజ అని తెలిసిన తర్వాత సినిమాను ఒప్పుకోలేదని తెలుస్తోంది. వీరిద్దరూ ఎందుకు ఒకరితో మరొకరు నటించకూడదని నిర్ణక్ష్ం తీసుకున్నారో దర్శకుడికి కూడా తెలియదన్నారు. బలుపు సినిమా తర్వాత ఏ సినిమాలోను వీరు కలిసి నటించలేదు. అందుకు కారణం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియదు. తెలియని కోల్డ్ వార్ ఏదో వీరి మధ్య నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్ తో పాటు మరో సినిమా చేస్తోంది. అది తన సొంత బ్యానర్ పై నిర్మాణమవుతోంది.