అక్కినేని నాగార్జున గ్యారేజీలోకి కొత్త కారు వచ్చి చేరింది. ఆయన తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అంతకుముందే ఆయన దగ్గర రూ. 1.50 కోట్లు ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్‌రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో లగ్జరీ కార్లు గ్యారేజీలో ఉన్నాయి. తాజాగా ఆయన కియా ఈవీ 6 కొనుగోలు చేశారు. ఇది ఎలక్ట్రిక్ కార్ అని సమాచారం. ఈ కారుకు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయట. వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. డ్రైవర్ సీటు పది రకాలు అడ్జస్ట్ చేసుకునే వీలుందట. కేవలం నాలుగు నిమిషాలు ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అంత ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. ఫుల్ కెపాసిటీ 77.4 కిలో వాట్స్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్స్ ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ కార్ ధర సుమారు రూ. 60 నుండి 70 లక్షలు ఉంటుంది.
మన్మథుడు నాగార్జున తన కొత్త సినిమాను ప్రకటించారు. తన 62వ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్, మోహన్ రాజాలతో నాగార్జున ఈ మూవీ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ రెండు ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయని మరో వార్త. ఇక నాగార్జున సోలోగా హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా మంచి విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ఘోస్ట్ తదితర సినిమాలు పరాజయం పాలయ్యాయి. కొడుకు నాగ చైతన్యతో కలిసి చేసిన బంగార్రాజు పర్లేదు అనిపించుకుంది. అటు నాగ చైతన్య, అఖిల్ కూడా హిట్స్ లేక స్ట్రగుల్ అవుతున్నారు.