గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా పోలీసులకు దొరికిన హీరో…

- Advertisement -

అక్కినేని హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కస్టడీ సినిమాలో నటిస్తున్నాడు.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నాడు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా మే 5న విడుదల కాబోతుంది. సినిమా విడుదల నేపథ్యంలో మూవీ యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.. ఇక నాగ చైతన్య కూడా పలు ఇంటర్వ్యూ లో పాల్గొంటు మూవీ గురించి పలు విషయాలను పంచుకుంటున్నాడు.. ఇకపోతే తాజాగా నాగ చైతన్య పోలీసులకు దొరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

నాగ చైతన్య

ఈ క్రమంలో తాజాగా నాగ చైతన్య ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో పాల్గొన్నాడు.. ఆ గేమ్ లో నాగచైతన్యకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో మీరు లైఫ్ లో ఎప్పుడైనా పశ్చాత్తాప పడ్డారా అంటే.. లైఫ్ లో అలాంటిదేమీ లేదు ఒక మూడు సినిమాలు ప్లాప్ అయినప్పుడు బాధపడ్డాను అని చెప్పాడు. అలాగే మీరు కారులో ఎవరైనా అమ్మాయితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయారా అని యాంకర్ అడగగా.. అవును దొరికిపోయాను పోలీసులకు అని నాగచైతన్య నవ్వుతూ సమాధానం ఇచ్చారు.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది… తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా రిపోర్టర్ కు దిమ్మతిరిగేలా ఆన్సర్ చెప్పాడు అందుకు సంబందించిన వీడియో కూడా వైరల్ అవుతుంది..

నాగచైతన్య హీరోగా చేసిన థాంక్యూ, లాల్ సింగ్ చెద్దా రెండు సినిమాలు ప్లాప్ అవడంతో, ఇప్పుడు నాగచైతన్య ఆశలన్నీ కస్టడి సినిమా పైనే పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి ఇక.. నాగ చైతన్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కూడా ఆమెతో ఉండలేకపోయాడు.

- Advertisement -

పెళ్ళైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకొని ఇద్దరు వారి కెరియర్ పై ఫోకస్ చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో హీరోయిన్ శోభిత దూళిపాలతో నాగచైతన్యకు సీక్రెట్ ఎఫైర్ ఉందని వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.. మరి వారు నిజంగా పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

https://www.youtube.com/shorts/Rs21MqSoCfg
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here