Kiran Abbavaram : పెళ్లి తేదీని ప్రకటించిన హీరో కిరణ్ అబ్బవరం..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్!

- Advertisement -

Kiran Abbavaram : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఈయనకంటూ ఒక సెపెరేట్ ఆడియన్స్ ని తన మొదటి సినిమా నుండే ఉండేలా చూసుకున్నాడు. రాజా వారు రాణి వారు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన మొదటి సారి వెండితెర మీద కనిపించారు. ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా, సరిగా ప్రమోట్ చెయ్యకపోవడం వల్ల కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఇక ఆ తర్వాత ఆయన SR కల్యాణ మండపం చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ ప్రొడక్షన్ సంస్థలలో పని చేస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా నిలిచాడు.

Kiran Abbavaram
Kiran Abbavaram

గత ఏడాది వరకు కిరణ్ అబ్బవరం వి ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల అయ్యేవి. కానీ వరుసగా ఫ్లాప్స్ ఎదురు అవుతూ ఉండడం తో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి, చాలా కాలం నుండి ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా రహస్య ఇంస్టాగ్రామ్ లో కిరణ్ అబ్బవరం తో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ వీడియో ని అప్లోడ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసింది. అంతే కాకుండా అదే వీడియోలో మరో 38 రోజుల్లో నువ్వు నా భర్తవి కాబోతున్నావు, అన్ని రోజులు ఎదురు చూడలేకపోతున్నాను అని తెలిపింది.

Kiran Abbavaram To Marry His First Heroine Rahasya Gorak After Five Years Of Dating | Republic World

- Advertisement -

38 రోజులు అంటే ఆగష్టు 23 లేదా 24 వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుంది అన్నమాట. ఈ విషయం తెలియచేయడంతో సోషల్ మీడియా లో అందరూ రహస్య, కిరణ్ అబ్బవరం కి శుభాకాంక్షలు తెలియచేసారు. ఇకపోతే నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘క’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకొని మంచి పాన్ ఇండియన్ సబ్జెక్టు తో రాబోతున్నావని, ఈసారి పెద్ద హిట్ కొడుతావు అంటూ ఆయన అభిమానులు ఈ టీజర్ ని చూసి రెస్పాన్స్ ఇచ్చారు. శ్రీ చక్రాస్ ఎంటెర్టైమెంట్స్ పతాకం పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here