Aishwarya Rai : సెలబ్రిటీలు ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్నదానికైనా డబ్బు విషయంలో రాజీ పడనే పడరు. వారు ప్రతి దాంట్లో లగ్జరీ కోరుకుంటారు. అత్యవసరాల విషయాలలో మాత్రం వారి ఖర్చు సామాన్యులు ఊహించని విధంగా ఉంటుంది. చాలామంది సినీ సెలబ్రిటీలు తాము సంపాదించే దాంట్లో చాలా వరకు తమ పిల్లల విలాసవంతమైన జీవితం కోసమే ఖర్చు చేస్తారు. అందాల తార ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్య చదువు కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలిస్తే సామాన్యులు నోరెళ్ల బెట్టడం ఖాయం.
ప్రస్తుతం ఏ చిన్న స్కూల్లో పిల్లలను చదివించాలన్నా ఫీజులు అనేవి లక్షల్లో ఉంటున్నాయి. అయినా మిడిల్ క్లాస్ ప్రజలు తమ పిల్లలను ఎంత కష్టమైన పడి లక్షల్లో ఫీజులు కడతానికి వెనుకాడడం లేదు. చదువే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందని వారి నమ్మకం. మరి సామాన్యులే అలా భావిస్తుంటే.. కోట్లలో సంపాదించే వారి ఆలోచన మరెలా ఉంటుంది. సెలబ్రిటీలు వారి పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద విషయం ఏం కాదు. ఐశ్వర్య రాయ్ తన పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించేశారు. పెళ్లి తర్వాత తాను ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. తన భర్త అభిషేక్ బచ్చన్ కూడా సినిమాల్లో మునపటిలా యాక్టివ్‌గా లేడు. వారి కూతురు ఆరాధ్య ముంబైలోని అత్యంత ఖరీదైన స్కూలు.. అదే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతోంది. దాంట్లో ఫీజుల గురించి వింటే షాక్ అవ్వాల్సిందే.
ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అక్కడ ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు రూ.1.70 లక్షలు. ఇక 8వ తరగతి నుంచి 10 తరగతి వరకు రూ.4.48 లక్షలు ఉంటుందట. ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే 11,12 క్లాసులు కూడా ఉంటాయి. వాటి ఫీజు రూ.9.65 లక్షలట. కేవలం ఐశ్వర్య, అభిషేక్ కూతురు మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ కొడుకు అబ్రహం, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, చుంకీ పాండే తదితర సెలబ్రిటీల పిల్లలు కూడా ఇదే స్కూల్‌లో తమ చదువుతున్నారు. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.