Mokshagna Teja : ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియా.. అటు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు చిరంజీవి క్రేజ్ తగ్గగా బాలయ్య మాత్రం దున్నేస్తున్నాడు. త్వరలోనే కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రాబోతున్నాడు. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన రానుంది. తెర వెనక మాత్రం తనను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు బాగానే ప్లాన్స్ మొదలుపెట్టేసారు. రీసెంట్గా మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ లీక్ అయి వైరల్ అవుతుంది.
త్వరలో ఎన్నికలు రానుండడంతో తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉంటే.. కొడుకు మోక్షజ్ఞ మాత్రం హీరోయిన్ శ్రీ లీలను రక్షించే పనిలో బిజీ అయ్యాడన్న కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ శ్రీ లీల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. శ్రీ లీల కోసం మోక్షజ్ఞ తనే కాకుండా తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడట. ఈ మధ్యకాలంలో శ్రీలీల ను బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. బూతు కామెంట్లతో ఇబ్బంది పెడుతున్నారు. భగవంత్ కేసరి షూట్ లో మీట్ అయిన శ్రీలీల.. మోక్షజ్ఞ అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
అప్పటి నుంచి వీరిద్దరి పై చాలా కామెంట్స్ వినిపించాయి. ఈ రూమర్స్ పై మోక్షజ్ఞ చాలా బాధపడ్డాడట. బాగా డిసప్పాయింట్ అయ్యాడట. చాలా బాధపడుతూ శ్రీలీల చాలా మంచి అమ్మాయి. ఇలాంటి ట్రోలింగ్ ఆపండి ఫ్లీజ్ అంటూ ప్రత్యేకంగా తన స్నేహితులకు చెప్పి ఇలాంటి కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. దీంతో శ్రీలీల.. మోక్షజ్ఞకి థాంక్యూ చెప్పిందట.
ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ నందమూరి అభిమానుల ఆశ్చర్యపోతున్నారు. వీరి యవ్వారం మామూలుగా లేదుగా.. నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి? కాబోయే భార్యను ఇప్పటినుంచే ఏం అననివ్వట్లే కదా? అంటూ జనాలు మరింతగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.