Hanuman Movie : మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ బలంగా ఉంటే ఏ బాషా చిత్రం ని అయినా నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తాం. ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలను మన వాళ్ళు ఏ రేంజ్ లో చూస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ మన తెలుగు సినిమాలను మాత్రం వాళ్ళు ఎంత పెద్ద సూపర్ హిట్ అయినా సరే చూసేందుకు అసలు ఇష్టపడరు.

కేవలం రాజమౌళి సినిమాలు తప్ప, ఇప్పటి వరకు ఒక్క నాన్ రాజమౌళి సినిమా కూడా తమిళ నాట పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చినట్టు మనం ఇది వరకు చూడలేదు. తమిళ వాళ్లకు ఎందుకో మన తెలుగు బాషా అన్నా, తెలుగు సినిమాలు అన్నా అంత చిన్న చూపు. రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ ప్రభంజనం సృష్టి వంద కోట్ల షేర్ మార్కు వైపు పరుగులు తీస్తున్న ‘హనుమాన్’ తమిళ వెర్షన్ వసూళ్ల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

ఈ సినిమాకి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ ఆడియన్స్ కూడా బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం హిందీ వెర్షన్ నుండి దాదాపుగా 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ తమిళ వెర్షన్ లో మాత్రం ఇప్పటి వరకు కేవలం కోటి రూపాయిల గ్రాస్ కూడా రాలేదు, మలయాళం లో కూడా ఇదే పరిస్థితి కానీ, అక్కడ తమిళ వెర్షన్ కంటే కాస్త బెటర్ వసూళ్లు వచ్చాయనే చెప్పాలి.

ఈ చిత్రానికి అక్కడ ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ తమిళ వెర్షన్ కి ఇంత తక్కువ వసూళ్లు రావడం ని చూస్తుంటే వాళ్ళు కావాలనే మన సినిమా ని థియేటర్స్ లో చూడకుండా బ్యాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ భాషల్లో మంచి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ పరంగా మాత్రం డిజాస్టర్ గా నిల్చింది.