Hanuman Movie : చిన్న సినిమాగా తెరకెక్కి ఆడియన్స్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రాలలో ఒకటి ‘హనుమాన్’. గత ఏడాది టీజర్ తో ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది ఈ చిత్రం. ఇంత తక్కువ బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఏమిటి?, అసలు ఇది నిజంగానే 30 కోట్ల బడ్జెట్ లోపు తీసిన సినిమానేనా అని అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆ క్రేజ్ ఈ చిత్రానికి అలాగే కొనసాగుతూ వచ్చింది.
సినిమా వాయిదా పడితే క్రేజ్ పోతుంది అంటారు, ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. కానీ క్రేజ్ పెరిగిందే కానీ తగ్గలేదు. అలా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే జనవరి 12 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుండడం తో ‘హనుమాన్’ కి థియేటర్స్ కొరత ఏర్పడింది.
దీంతో ఆ సినిమా మేకర్స్ ‘హనుమాన్’ కి ముందు రోజు సాయంత్రం నుండి అన్నీ ప్రాంతాలలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసారు. ఈ షోస్ కి వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ నంబర్స్ ని చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యింది. వేసిన షోస్ వేసినట్టే ఫుల్ అయిపోతున్నాయి. పబ్లిక్ డిమాండ్ ని చూసి, హైదరాబాద్ లో అత్యధిక థియేటర్స్ హనుమాన్ మూవీ ని ప్రీమియర్ షో వేసుకోవడానికి క్యూలు కడుతున్నాయి.
కేవలం హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండే దాదాపుగా 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాలలో కూడా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ సినిమా కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండే రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు రాబడుతుందని అంటున్నారు, చూడాలి మరి.