Hansika : సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లీస్ట్ అందులో హన్సిక పేరు కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ లో ఒక చైల్డ్ ఆర్టిస్టు గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేశముదురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఈ సినిమా అప్పుడు ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయస్సులో ఆమె తెలుగు , తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తెలుగు లో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ, క్రేజ్ మాత్రం బాగానే ఉంది. ఇక తమిళం లో ఈమె రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
తమిళం లో ఈమెకి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు అనొచ్చు. అక్కడ హీరోయిన్స్ ని ఎంతలా ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే. గతం లో మనం ఎన్నో ఉదాహరణలు చూసాము. ఇది ఇలా ఉండగా హన్సిక గత ఏడాది సోహెల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గానే ఈమె ఒక తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పుకొచ్చింది.
తన భర్త ఎంతో మంచోడని, చాలా బాగా తనని చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. ఇకపోతే అర్థరాత్రులు తనకి పని లేనప్పుడు వెబ్ సిరీస్ లు చూడడం బాగా అలవాటని, ఒక్కసారి వెబ్ సిరీస్ మొదలు పెడితే పూర్తిగా చూసే వరకు నిద్రపోనని, నాతో పాటు నా భర్తని కూడా పక్కనే కూర్చోబెట్టుకుంటానని, పాపం అతనికి నా వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చిందంటూ హన్సిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.