Hansika : టాలీవుడ్ యంగ్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన బబ్లీ బబ్లీ యాక్టింగ్ తో స్టార్ స్టేటస్ అందుకుంది. ఇటు తెలుగు అటు తమిళ్ సినిమాల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు పెడుతూ ఉంటుంది. ఇటీవల ఆమె ప్రియుడిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. ప్రస్తుతం హన్సిక ‘మై నేమ్ ఈస్ శృతి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో శ్రీనివాస్, ఓంకార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హన్సిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత నా లైఫ్ ఏం మారలేదు. షూటింగ్ టైంలో సినిమాలోని క్యారెక్టర్లో ఉంటాను.
ఇంటికెళ్లిన తరువాత నా భర్తతో ఉంటా అంతే తేడా. ఇక సాయంత్రం 6 తర్వాత నా భర్తతో కచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. అలాగే మెయిన్ గా నా మ్యారేజ్ తరువాత నా అడ్రస్ మాత్రమే మారింది. నా ఇంటి పేరు కూడా మారలేదు. ఎందుకంటే హన్సిక మోత్వానీ అని ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు’ అని పేర్కొంది. ప్రస్తుతం హన్సిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.