Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు హిట్టైనా, ఫ్లాప్ అయినా బుల్లితెర ఆడియన్స్ మాత్రం బ్రహ్మరథం పడుతారని ట్రేడ్ పండితులు చెప్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకీ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మహేష్ కి బుల్లితెర ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారు అనడానికి మరో నిదర్శనంగా నిల్చింది రీసెంట్ గా విడుదలైన గుంటూరు కారం చిత్రం.

సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. కేవలం కోస్తాంధ్ర తప్ప మిగిలిన అన్నీ చోట్ల ఈ సినిమాకి 50 శాతం కి పైగా నష్టాలు వాటిల్లాయి. సినిమా కంటెంట్ డీసెంట్ గానే ఉంది అని కొంతమంది అన్నప్పటికీ, అది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ రేంజ్ స్టాండర్డ్ కాకపోవడం వల్లే ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అయితే ఈ సినిమాని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో విడుదల చేసారు. నెట్ ఫ్లిక్స్ నుండి ఈ సినిమాకి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో ‘సినిమా చాలా బాగుందే..ఎందుకు ఫ్లాప్ అయ్యింది’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

మొదటి నుండి మన టాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు హిందీ లో మంచి డిమాండ్ ఉంటుంది. పైగా మహేష్ బాబు సినిమా అంటే ఇంకా కాస్త ఎక్కువ. అందుకే ఈ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. రోజు ఈ సినిమాకి వస్తున్నాని వ్యూస్ ‘ఎనిమల్’, ‘సలార్’ చిత్రానికి కూడా రావడం లేదట. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా పీక్ రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు, చూడాలి మరి.
