Pallavi Prashanth : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ కోసం అటు అభిమానులు ఎంతలా అయితే ఎదురు చూస్తున్నారో , ఇటు ఆడియన్స్ మరియు ట్రేడ్ కూడా అంతే ఎదురు చూస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ పవర్ అలాంటిది మరి. రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ని జారీ చేసారు.
సంక్రాంతికి వస్తున్న అసలు సిసలు కమర్షియల్ సినిమా ఇదేనని, కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతుందని సెన్సార్ సభ్యుల నుండి అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్. కానీ పోలీసులు మాత్రం అందుకు అనుమతించలేదు, దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కైతలపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని అనుకున్నారు మేకర్స్.
జనవరి 9 వ తారీఖున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నట్టు టాక్. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడానికి కారణం పల్లవి ప్రశాంత్ అని సోషల్ మీడియా లో ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ ని గెలిచి బయటకి వస్తున్న సమయం లో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర నుండి యూసఫ్ గూడా వరకు ఎంత పెద్ద రచ్చ జరిగిందో మనమంతా చూసాము.
ఈ రచ్చ కారణంగా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. పల్లవి ప్రశాంత్ బయటకి వస్తేనే అభిమానులను అదుపు చేయలేకపోయాము, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తే ఆపగలమా?, అందుకే అనుమతిని ఇలాంటి ప్రదేశాల్లో ఇవ్వడం లేదని పోలీస్ వారు మేకర్స్ కి చెప్పారట. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ క్యాన్సిల్ అయ్యింది అంటూ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.