Guntur Kaaram : త్రివిక్రమ్ సినిమాలు ఒకప్పుడు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేంత అద్భుతమైన రిపీట్ వేల్యూ తో ఉండేవి. కానీ ఆ తర్వాత మధ్యలో ఆయన డైలాగ్స్ పరంగా అదరగొట్టేసేవాడు కానీ, సినిమాలను మాత్రం కాపీ కొడుతూ వచ్చేవాడు. జులాయి సినిమాలో బ్యాంక్ రాబరీ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సన్నివేశం ని పాపులర్ ఇంగ్లీష్ బ్లాక్ బస్టర్ మూవీ బ్యాట్ మెన్ చిత్రం నుండి కాజేసాడు.
ఒక్కసారి ఆ సినిమా చూసి, జులాయి ని చూస్తే మక్కీకి మక్కి దింపేసాడు అనే విషయం అర్థం అవుతుంది. అలాగే ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని ‘గొప్పింటి అల్లుడు’ నుండి, ‘అ..ఆ!’ చిత్రాన్ని ‘మీనా’ అనే సినిమా నుండి, ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని ‘లార్గో వించ్’ అనే సినిమా నుండి , ‘అలా వైకుంఠపురం’ చిత్రాన్ని ‘ఇంటి గుట్టు’ సినిమా నుండి, ఇలా అనేక సినిమాల్లోని మంచి సన్నివేశాలను కాపీ కొట్టి తెరకెక్కించాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎప్పటి నుండో త్రివిక్రమ్ పై విరుచుకుపడుతున్నారు.
ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రాబోతున్న ‘గుంటూరు కారం’ చిత్రం కూడా ఒక మలయాళం సినిమాకి రీమేక్ అని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మలయాళం లో మమ్ముటి హీరో గా నటించిన ‘రాజమాణిక్యం’ అనే సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. నిన్న విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ ని చూస్తే, ఈ సినిమా ‘రాజమాణిక్యం’ కి రీమేక్ లాగ ఉందే అని అనిపించింది.
రాజమాణిక్యం సినిమాలో హీరో కొన్ని కారణాల వల్ల తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్లిపోవడానికి కారణం తన సవతి తల్లి కొడుకు ని జైలు నుండి బయటకి తీసుకొని రావడం కోసం అని తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు జైలు నుండి బయటకి వచ్చిన హీరో తండ్రి ఆస్తి కోసం కొట్టుకుంటున్న అన్నదమ్ములను కలిపి కథని సుఖాంతం చేస్తాడు. ‘గుంటూరు కారం’ మూవీ స్టోరీ కూడా ఇదే అని అంటున్నారు, చూడాలి మరి.