Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుండి వసూళ్లు అమాంతం పడిపోయాయి. మరోపక్క సినిమా తో పాటు విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్స్.
ఒక్కమాట లో చెప్పాలంటే గుంటూరు కారం చిత్రాన్ని భారీ మార్జిన్ తో పలు ప్రాంతాలలో దాటేసింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను దక్కించుకుంది హనుమాన్ చిత్రం. ఇది ఇలా ఉండగా ‘గుంటూరు కారం’ చిత్రానికి కనీసం సంక్రాంతి సెలవుల్లో కలెక్షన్స్ కలిసి వస్తాయని అనుకున్నారు. కానీ పండగ సెలవల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.
గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ సినిమాని పలు ప్రాంతాలలో 2021 సంక్రాంతికి విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రం డామినేట్ చేసింది. ఉదాహరణకి వైజాగ్ వంటి ప్రాంతం లో ‘అల్లుడు అదుర్స్’ సినిమాకి ఇదే పండగ సీజన్ సమయం ఆరు థియేటర్స్ లో వైజాగ్ సిటీ లో ప్రదర్శించారు. అన్నీ షోస్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. కానీ గుంటూరు కారం చిత్రానికి కేవలం నాలుగు థియేటర్స్ మాత్రమే దక్కాయి.
కేవలం సాయంత్రం ఆటలు తప్ప మిగిలిన ఆటలకు హౌస్ ఫుల్స్ పడలేదు. దీనిని బట్టి ‘గుంటూరు కారం’ సినిమాకి ఏ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చిందో, ఆ సినిమా మీద ‘హనుమాన్’ ప్రభావం ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ‘గుంటూరు కారం’ చిత్రం 70 కోట్ల రూపాయిల లోపే కలెక్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.