Guess The Actress :ఒకప్పుడు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగి, పాన్ ఇండియా లెవెల్ లో మన తెలుగోడి సత్తా చాటిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు మతి భ్రమించి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సాధించిన విజయాలను చూసి రాజమౌళి లాంటి లెజెండరీ దర్శకులు కూడా గొప్పగా చెప్తారు. అలాంటి స్థాయి నుండి నేడు కన్న కూతురు కూడా అసహ్యించుకునే రేంజ్ కి దిగజారిపోయాడు.

బూతు సినిమాలు చేస్తూ, బ్లూ ఫిలిం డైరెక్టర్ లాగ మారిపోయిన రామ్ గోపాల్ వర్మ, అప్పుడప్పుడు వేరే వాళ్ళు ఇచ్చే డబ్బులను తీసుకొని వాళ్లకు అనుకూలంగా సినిమాలు తియ్యడం వంటివి కూడా చేస్తుంటాడు. అలా అతను రీసెంట్ గా సీఎం జగన్ ని కి అనుకూలంగా , నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని చెడుగా చూపిస్తూ ‘వ్యూహం’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా విడుదలకు నిన్న మొన్నటి వరకు హై కోర్టు స్టే ఇచ్చింది.

కానీ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ సినిమాని విడుదల చేసుకోవచ్చు అంటూ లేటెస్ట్ గా తుది తీర్పుని ఇచ్చింది. దీంతో ఈ సినిమాని ఫిబ్రవరి 16 వ తారీఖున విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సందర్భంగా ఆయన ఎంజాయ్ చేస్తూ , ఫుల్ గా మద్యం సేవించి అమ్మాయిలతో కలిసి ఫోటో తీసి సోషల్ మీడియా అప్లోడ్ చేసాడు.

పైగా చంద్రబాబు నాయుడు, పవన్కళ్యాణ్ , నారా లోకేష్ ని ట్యాగ్ చేసి మా వ్యూహం సినిమా రిలీజ్ అవ్వబోతున్నందుకు ఎంజాయ్ చేస్తున్న అని పోస్ట్ వేసాడు. అయితే ఈ ఫోటో లో ఉన్న అమ్మాయిని చూసి అందరూ ఈమేంటి రష్మిక లాగ ఉంది, అచ్చు గుద్దినట్టు ఆమె లాగానే ఫోజులు కూడా పెట్టింది అంటూ కామెంట్స్ చేసారు. కానీ ఈమె రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రం హీరోయిన్ అట.
