Guess The Actress : క్రింద కనిపిస్తున్న ఫొటోలో ఉన్న చిన్నారి కి తల్లి ఎవరో గుర్తుపట్టగలరా..?, తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. బాలీవుడ్ లో దాదాపుగా లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకున్న ఈమె టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా కూడా చేసింది.
ఇక ఆ తర్వాత హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, పలు సినిమాల్లో లేడీ విలన్ గా కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈమె ఇండియన్ నటి కాదు, దాదాపుగా హాలీవుడ్ నటి అయిపోయింది, తన ఆస్తులు మొత్తం కూడా రీసెంట్ గానే అమ్మేసి అమెరికా కి తన ఫ్యామిలీ తో షిఫ్ట్ అయిపోయింది. ఆమె ఎవరో మీకు ఈపాటికే అర్థం అయిపోయి ఉండాలి, ఆమె పేరు ప్రియాంక చోప్రా.
రీసెంట్ గానే ప్రియాంక తన కూతురు మాలతి రెండవ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపించింది. ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చెయ్యగా, అది నేడు వైరల్ గా మారింది. చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈమెని చూస్తుంటే అచ్చం ఆమె అమ్మనే గుర్తుకు వస్తుంది. ఇక పొతే ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు దూరం అయ్యింది.
ఆమె ద్రుష్టి మొత్తం ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల పైనే పెట్టింది. అయితే రీసెంట్ గా మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఈ సినిమాలో దక్కింది .కానీ ఆమె నటిస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా ఖరారు చేసి చెప్పలేదు . త్వరలోనే దీనిపై రాజమౌళినే స్వయంగా మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి చెప్పబోతున్నాడట.