Guess The Actress : ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించి నేడు ముఖ్యమంత్రి కోడలు అయ్యింది!

- Advertisement -

Guess The Actress ఈ క్రింది ఫోటో లో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్న పాప ఎవరో గుర్తు పట్టారా, ఈమె ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు కోలీవుడ్ , బాలీవుడ్ ని కూడా ఒక ఊపు ఊపేసింది. కుర్రాళ్లు అప్పట్లో ఆమె అంటే పడి చచ్చిపోయేవాళ్లు. దర్శక నిర్మాతలకు, స్టార్ హీరోలు ప్రతీ ఒక్కరు ఆమె డేట్స్ కోసం క్యూలు కట్టేవారు.ఒకే ఒక్క సినిమా తో కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసింది.

Guess The Actress
Guess The Actress

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి , అక్కడ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కడ ఒక హీరో తో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకొని ఇద్దరు మగపిల్లలకు తల్లి కూడా అయ్యింది. ఇప్పుడు మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ముఖ్య పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

Genelia

ఆమె మరెవరో కాదు జెనీలియా. తమిళం లో శంకర్ దర్శకత్వం లో వచ్చిన ‘బాయ్స్’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ, ఆ తర్వాత తెలుగు లో ‘సత్యం’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సుమంత్ హీరో గా నటించిన ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికీ పాపులర్.

- Advertisement -
Actress Genelia

ఈ సినిమా తర్వాత ఆమె నటించిన సై , బొమ్మరిల్లు ,ఢీ,రెడీ ,హ్యాపీ,సాంబ,నా అల్లుడు,ఆరెంజ్, శశిరేఖాపరిణయం ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వీటిల్లో ‘బొమ్మరిల్లు’ చిత్రం లోని హాసిని క్యారక్టర్ ని ఇప్పటికీ మరచిపోలేము. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు జెనీలియా ని తమ సొంత ఇంటి అమ్మాయిలాగా అనుకునేవారు ఈ చిత్రాన్ని చూసి. ఇక బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడి స్టార్ హీరో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కొడుకు, రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు దూవురమైనా జెనీలియా ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here