Guess The Actress : సీరియల్ ఆర్టిస్టు నుండి పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బుడ్డది ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : ఈ ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఈమె తెలుగు లో చేసింది ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమానే, కానీ ఆ ఒక్క సినిమాతోనే తన అందం మరియు నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక్కడ ఆమెకి మొదటి సినిమానే అయినా హిందీ లో మాత్రం గత కొంత కాలం గా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Guess The Actress
Guess The Actress

ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో కూడా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్, లేటెస్ట్ గా హీరో నాని తో కూడా ఒక సినిమా ఒప్పుకుంది. ఆమె మరెవరో కాదు, దర్శకుడు ‘హను రాఘవపూడి’ తెరకెక్కించిన లేటెస్ట్ వెండితెర దృశ్య కావ్యం ‘సీతారామం’ చిత్ర హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టింది.

Mrunal Thakur

ఎవరు ఈమె ఇంత బాగుంది, ఇంత అద్భుతంగా నటిస్తుంది, ఇన్ని రోజులు ఈమె ఎక్కడ ఉంది అంటూ ఈమె గురించి వెతకడం ప్రారంభించారు సీతారామం సినిమా సమయం లో నెటిజెన్స్. అలా వెతకడం వల్ల ఈమె గురించి ఎన్నో విషయాలు బయటపడ్డాయి.ఈమె ప్రారంభం లోనే సినిమా హీరోయిన్ గా వచేయలేదు. ముందు సీరియల్స్ లో హీరోయిన్ గా మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ముఖ్యంగా అప్పట్లో జీ టీవీ లో ప్రసారమైన ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

- Advertisement -
Mrunal takur photos

తెలుగు లో కూడా ఈ సీరియల్ ని దబ్ చేసి జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. ఇక్కడ కూడా ఈ సీరియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలా సీరియల్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ కి ‘లవ్ సోనియా’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత ‘హృతిక్ రోషన్‘ హీరో గా నటించిన ‘సూపర్ 30 ‘ చిత్రం లో హీరోయిన్ గా నటించి తొలి సూపర్ హిట్ ని అందుకుంది.ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.ఇప్పుడు ఈమె చేతిలో మూడు హిందీ సినిమాలు మరియు ఒక తెలుగు సినిమా ఉంది.అయితే ఈమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతున్నాయి, ఆ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Mrunal takur childhood photos
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here