Guess The Actress : కొంతమంది హీరోయిన్స్ తెలుగు చేసింది ఒకటి రెండు సినిమాలే అయ్యినప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని ముద్రని జనాల్లో వేసి వెళ్తుంటారు. ఎప్పుడైనా టీవీలలో వాళ్లకు సంబంధించిన సినిమా వచ్చినప్పుడు ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుంది?, ఈమధ్య కనిపించడం లేదే అని అనుకుంటూ ఉంటాం. అలా తెలుగు ఆడియన్స్ ఎంతో ఇష్టమైన ‘జర్నీ’ అనే సినిమాలో శర్వానంద్ కి జోడీ గా నటించిన అనన్య గురించి కూడా అనేక సందర్భాల్లో అనుకునే ఉంది ఉంటారు ఆడియన్స్.

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎంత పద్దతిగా ఉంటుందో మనం అంత తేలికగా మర్చిపోలేం. ఈ సినిమా తర్వాత ఆమె త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ‘అ..ఆ’ చిత్రం లో హీరో నితిన్ కి చెల్లెలు గా నటించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ కి జోడిగా నటించింది ఈమెనే.

తెలుగు లో కంటే కూడా ఎక్కువగా ఆమె మలయాళం మరియు తమిళ సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది. అయితే ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో ఎంతో పద్దతిగా, అచ్చతెలుగు అమ్మాయి లాగ కనిపించిన ఈమె మోడరన్ లుక్స్ తో ఇంత స్టైలిష్ గా ఇంత హాట్ గా తయారైంది ఏమిటి అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.

ఈమె చాలా కాలం నుండి ఇంస్టాగ్రామ్ లో ఉంది అనే విషయం మన ఆడియన్స్ కి ఈమధ్యనే తెలిసింది. అయితే ఈమె హీరోయిన్ గా నటిస్తున్న మూడు కొత్త సినిమాలు ఇంకా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. అందులో రెండు మలయాళం సినిమాలు ఉండగా, ఒక్క తమిళ సినిమా కూడా ఉంది. ఇకపోతే ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాం చూడండి.