Guess The Actress : క్రింద కనిపిస్తున్న ఫోటో లో సోడా బుడ్డి అద్దాలు వేసుకొని అయ్యోమయ్యం గా చూస్తున్న చిన్న పాప ఎవరో గుర్తు పట్టారా..?,ఈమె మన టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టింది.ఆ తర్వాత కొన్నాళ్ళకు హైదరాబాద్ లో ఒక హోటల్ లో పోలీసులు రైడింగ్ జరపగా, వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అంటూ ఈమెపై కేసు కూడా నమోదు చేసారు, ఆమె మరెవరో కాదు శ్వేతా బసుప్రసాద్.

బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిన నటి శ్వేతా బసు ప్రసాద్.’మక్తే’ అనే సినిమా ద్వారా బాలనటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్వేతా బసు ప్రసాద్,ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి వరుసగా చైల్డ్ ఆర్టిస్టు రోల్స్ లో నటించే అవకాశం దక్కింది.అలా ఈమె టాలీవుడ్ లోకి ‘కొత్త బంగారు లోకం’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈమెకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.ముఖ్యంగా ఆ సినిమాలో ఈమె పలికిన కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

అలా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి, కానీ రైడ్ అనే చిత్రం మినహా ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.అయినా కూడా ఈమెకి అవకాశాలు బాగానే వచ్చేవి, అయితే దురదృష్టం కొద్దీ ఈమె 2014 వ సంవత్సరం లో ఒక హోటల్ పై పోలీసులు రైడింగ్ జరపగా,వ్యభిచారం చేస్తున్నట్టు గమనించి ఈమెని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసారు.ఆ తర్వాత కోర్టులో విచారణ జరిపాక శ్వేతా బసు ప్రసాద్ నిర్దోషి అని తేలింది.

నాంపల్లి కోర్టు ఈమెపై వేసిన కేసులన్నీ కొట్టేసింది. సమాజం లో నిర్దోషి గా బయటకి వచ్చిన శ్వేతా బసు ప్రసాద్, మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఈమెకి హీరోయిన్ రోల్స్ మాత్రం రాలేదు, సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే పరిమితమైంది, ఇప్పటికీ యాక్టీవ్ గానే సినిమాలు చేస్తూ వస్తున్నా శ్వేతా బసుప్రసాద్ కి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలు మీకోసం ఎక్సక్లూసివ్ గా క్రింద అందిస్తున్నాము చూడండి.
