Guess The Actress క్రింద ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా, సంసారం పక్షమైన పాత్రలు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ లో హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, నటన అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా చేసిన నటి ఆమె.ఇప్పటికీ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకెళ్తూనే ఉంది.ఆమె మరెవరో కాదు స్నేహ.’ఎన్నవాలే’ అనే తమిళ సినిమాతో ఈమె తన సినీ కెరీర్ ని ఆరంభించింది.

ఆ తర్వాత తెలుగు లో ‘ప్రియమైన నీకు’ అనే చిత్రం ద్వారా మనకి పరిచయమైంది.ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అయ్యి స్నేహ కి మంచి పేరు తీసుకొచ్చింది.ఎవరీ అమ్మాయి చూడచక్కగా ఉంది, నటన కూడా సౌందర్య గారిని గుర్తు చేస్తుంది అని ఈమెని చూసిన ప్రతీ ఒక్కరికి కలిగిన ఫీలింగ్.’ప్రియమైన నీకు’ చిత్రం 2001 వ సంవత్సరం లో విడుదలైంది,ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేలోపు అదే ఏడాది లో ఈమెకి తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

ఇక 2002 వ సంవత్సరం లో అయితే ఏకంగా 7 తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.మన ఇండస్ట్రీ లో తెలుగు అమ్మాయిలకు సినిమా అవకాశాలు దక్కవు అనే వాదన ఉంది.కానీ తెలుగు అమ్మాయి అయ్యుండి కూడా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో హీరోయిన్ గా నటించి టాప్ స్టార్ గా ఎదిగింది స్నేహ.మరో విశేషం ఏమిటంటే ఈ తెలుగు అమ్మాయికి తెలుగులో కంటే కూడా ఎక్కువగా తమిళం లోనే అవకాశాలు దక్కాయి.

పెళ్లి కూడా అక్కడి ఇండస్ట్రీ కి చెందిన ప్రసన్న అనే యువ హీరో ని ప్రేమించి పెళ్లాడింది.ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.ఈమధ్యనే స్నేహా ఈటీవీ లో ప్రసారమయ్యే ఒక రియాలిటీ షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.రీసెంట్ గా ఈమె వెండితెర మీద కనిపించిన చిత్రం క్రిస్టోఫర్,తెలుగులో ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించింది ‘వినయ విధేయ రామ‘ అనే చిత్రం, ఆ తర్వాత మళ్ళీ ఈమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అయితే ఆమెకి సంబంధించిన కొన్ని చిన్ననాటి ఫోటోలను మీకోసం కొన్ని ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.