Guess The Actress : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ ల ఫోటోలు, చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి..సెలెబ్రేటీల చిన్నప్పటి ఫోటోలను చూడటానికి అభిమానులు ఆసక్తి చూపడంతో నెట్టింట ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..ఇప్పుడు మరో బాలివుడ్ హీరోయిన్ మాస్క్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..కరోనా కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు H3N2 లాంటి కొత్త కొత్త వైరస్‌లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి..అందరూ మళ్లీ వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించారు. ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు. శానిటైజేషన్, సామాజిక దూరాన్ని ఫాలో అవుతున్నారు. ఈక్రమంలో సెలబ్రిటీలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాస్క్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది ఓ హీరోయిన్.

పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ 90వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగులోనూ ఈమెకు బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండోయ్. గతంలో బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబులతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ సొగసరి ఇప్పటికీ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంటోంది. మరి మాస్క్‌లో ఉన్నప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్‌ను ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు కేజీఎఫ్‌తో పాన్ ఇండియా పాపులారిటీ సొంతం చేసుకున్న బాలీవుడ్ అందాల తార రవీనా టాండన్. 90వ దశకంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ అందాల తార తెలుగులో బాలకృష్ణతో బంగారు బుల్లోడు, నాగార్జునతో ఆకాశవీధిలో, మోహన్‌బాబుతో కలిసి పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం స్పెషల్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సందడి చేస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ సిరీస్‌లో రవీనా పోషించిన రమికాసేన్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తన తదుపరి షూటింగ్ కోసం వెళుతూ ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కుమందీ అందాల తార. మాస్క్ ధరించి కెమెరాలకు కనిపించింది. మాస్క్లో ఉన్నా కూడా ఆమె అభిమానులు గుర్తుపట్టారు.. ఆమెతో ఫోటోలు, ఆటో గ్రాఫ్ లు తీసుకున్నారు.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంత వయస్సులో కూడా కుర్రహీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమె సొంతం.. వరుస సినిమాలతో అభిమానులను పలకరిస్తూనే ఉంది..