Guess The Actor : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన రకరకాల పాత ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎవరూ చూడని హీరోహీరోయిన్ల ఫోటోలను ఎలాగోలా కనిపెట్టి సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ప్రతీ రోజు ఒకటి రెండు కాదు ఎన్నో ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తున్నాయి . ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు మరెవరో కాదు పాన్ ఇండియా టాక్ ఆఫ్ ద టాప్ హీరో ..

ఆ హీరో పేరు చెప్తే చాలు అమ్మాయిలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు.. అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆ హీరో . బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు ఈ హీరో కనిపిస్తే అమ్మాయిలు ముసురుకుంటారు. మీకు ఇప్పటికే ఈ హీరో ఎవరో అర్థం అయిపోయింది అనుకుంటాను.. అవును మీ గెస్ చేసింది కరెక్టే.. మీరు జీనియస్.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బాబు ఎవరో కాదు.. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ “ఫ్యామిలీ స్టార్” సినిమాలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఆ సమయానికి తారక్ దేవర రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది..!!