Guess The Actor : ‘నారీ నారీ నడుమ మురారి’ అన్నట్టుగా రమ్యకృష్ణ, నగ్మ వంటి అందమైన హీరోయిన్స్ మధ్యలో నిల్చున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?, ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ ని శాసిస్తున్నాడు అనే చెప్పాలి. ప్రముఖ హీరోలు, హీరోయిన్లు , డైరెక్టర్లు ఇలా ఒక్కరా ఇద్దరా, ప్రతీ ఒక్కరు ఈయన చుట్టూనే తిరుగుతున్నారు.

కేవలం సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళే కాదు, రాజకీయ రంగానికి సంబంధించిన వారు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఈయన చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్థాయి వ్యక్తులతో కూడా ఆయనకీ మంచి సాన్నిహిత్యం ఉంది. ఏందీ ఈ రేంజ్ బిల్డప్ ఇస్తున్నాడు, బాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ఇతనికి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇంత బిల్డప్ ఇవ్వడానికి కారణం, ప్రస్తుతం అతను సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్న పాపులర్ జ్యోతిష్యుడు.

ఆయన మరెవరో కాదు, వేణు స్వామి. నిత్యం హీరో హీరోయిన్ల జాతకాలపై వివాదాస్పద కామెంట్లు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఈయన, చిన్నతనం నుండే సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. పైన చూసిన ఫోటో మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం లోనిది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశం అప్పుడు తీసిన ఫోటో ఇది.

అప్పట్లో ఈయన జనాలకు పెద్దగా సుపరిచితం కాదు కానీ, ఎప్పుడైతే సమంత విడాకులు తీసుకుంటుంది అని చెప్పాడో, అప్పటి నుండి ఇతను పాపులర్ అయ్యాడు. ఈయన సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళ గురించి చెప్పిన ప్రతీ మాట నిజమైంది. కొంతమంది హీరోయిన్లు ఇతను చెప్పిన మాటలకు భయపడి పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నోటి నుండి ఒక్క శుభం కూడా మాట్లాడని వేణు స్వామి కి సోషల్ మీడియా లో ఉన్న నెగటివిటీ అంతా ఇంత కాదు.