Guess The Actor : క్రింద ఫొటోలో క్యూట్ తో తన తల్లి తో ఆడుకుంటున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?, ఈమె మొదటి సినిమా మాస్ మహారాజ రవితేజ తో చేసింది. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా విచ్చేశాడు. యాడ్స్ ద్వారా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న ఈ బ్యూటీ కి అలా మొదటి సినిమా అవకాశం వచ్చింది.

సోషల్ మీడియా లో ఈ బ్యూటీ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇంస్టాగ్రామ్ నుండి ఆమె ఏ ఫోటో అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధిలో మిలియన్స్ సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. ఆమె మరెవరో కాదు, మాళవిక శర్మ. ఈమె సినిమాల్లోకి రాక ముందు రిజ్వీ ‘లా’ కాలేజీ లో, లా డిగ్రీ పూర్తి చేసింది.

న్యాయవాదిగా డిగ్రీ పట్టా పొందిన ఈ అమ్మాయి మనసు ఎందుకో మోడలింగ్ రంగం వైపు మరలింది. ఆ తర్వాత రవితేజ హీరో గా నటించిన ‘నెల టిక్కెట్టు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ చిత్రం తర్వాత హీరో రామ్ తో ‘రెడ్’ అనే చిత్రం చేసింది, ఇది కూడా కమర్షియల్ గా యావరేజి అయ్యింది.

ఇక రీసెంట్ గా సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్‘ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం తో, ఈ అమ్మాయికి ప్రస్తుతం చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. చూపులు తిప్పుకోలేని అందం ఉన్నా కూడా ఆమె సక్సెస్ కాకపోవడం పై అభిమానులు అసంతృప్తి తో ఉన్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ కంటే మాళవిక శర్మ ఎంతో అందం గా ఉందని, అలాంటి అమ్మాయికి సినిమాల్లో అవకాశాలు రాకపోవడం దురదృష్టం అంటూ బాధపడుతున్నారు. ఈమెకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

