Guess The Actor సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం ఉన్నా కూడా కాసంత అదృష్టం అనేది లేకుంటే మాత్రం కష్టమే.. ఎన్ని సినిమాలు చేసిన హిట్ కావు. అలా చాలామందికి రుజువైంది కూడా..నటనపరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం అంతగా అవకాశాలు కలిసి రాలేదు.. అది కొందరి విషయంలో మాత్రమే.. మరి కొంతమంది మాత్రం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు.. ఇక పలువురు హీరోయిన్స్ కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి తదుపరి ప్రాజెక్ట్స్ సెలక్ట్ చేసుకుంటున్నారు.

అలాంటి వారి జాబితాలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పైన ఫోటోలో చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టండి.తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మొదటితోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పలువురు స్టార్స్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గెస్ చెయ్యండి.. సంప్రదాయ చీరకట్టులో ముద్దులొలుకుతున్న ఈ చిన్నది మరెవరో కాదు. మలయాళీ కుట్టి నివేదా థామస్.

1995 నవంబర్ 2న కేరళలోని కన్నూర్ లో జన్మించిన నివేదా.. 2002లో మలయాళి చిత్రం ఉత్తరలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సీరియల్లలో నటించిన ఈ అమ్మడు.. 2008లో వెరుథే ఒరు భార్య చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అలరించింది. మలయాళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నివేదా.. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది..
నివేదా థామస్ ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్ లవర్ అఫ్ ఇడియట్, 118, బ్రేచేవారెవరురా, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నివేధా చివరిసారిగా శాకిని డాకిని చిత్రంలో కనిపించింది. ఇందులో రెజినా కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇటు వెండితెరపైనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ వరుస వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది నివేదా.. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తుంది..