Guess the actor : ఈ ఫొటోలో క్యూట్ గా స్వీట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?, రీసెంట్ గా ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఎన్నో సూపర్ హిట్స్ తగులుతూనే ఉన్నాయి.ఈమె మన టాలీవుడ్ కి చెందిన అమ్మాయి కాదు కానీ,పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది.ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు ,తమిళం మరియు మలయాళం బాషలలో సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.ఆమె మరెవరో కాదు సంయుక్త మీనన్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా దగ్గుపాటి కి జంటగా నటించింది,ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో ‘భింబిసారా’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.రెండు కమర్షియల్ గా భారీ హిట్స్ అయ్యాయి.

ఇక రీసెంట్ గానే తమిళ హీరో ‘ధనుష్’ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ చేసిన ‘సార్’ చిత్రం సూపర్ హిట్ గా నిల్చింది.అలా ఈ మలయాళీ కుట్టి చేస్తున్న ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో అగ్ర హీరోలు మరియు అగ్ర దర్శక నిర్మాతలు ఈమెని తమ సినిమాలలో హీరోయిన్ గా తీసుకునేందుకు క్యూ కట్టేస్తున్నారు.ప్రస్తుతం ఈమె సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియన్ మూవీ ‘వీరుపాక్ష’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ సినిమా.ట్రేడ్ లో కూడా మంచి బజ్ ఉంది, ఈ చిత్రం కనుక పెద్ద హిట్ అయితే సంయుక్త మీనన్ క్రేజ్ మరియు డిమాండ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుతుంది అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సంయుక్త మీనన్ తన చిన్ననాటి ఫోటోలను కొన్ని అప్లోడ్ చేసింది, అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది,ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

