Guess The Actor : టాలీవుడ్ లో ఎంత మంది హాస్య నటులు ఉన్న కొంతమంది మాత్రం ఎక్కువ సినిమాలలో చేసింది చిన్న పాత్రలే అయినా ప్రేక్షకుల మదిలో చిరస్థాయియిగా గుర్తు ఉండి పోతారు, అలాంటి నటులలో ఒక్కరు మేల్కొటే, పిల్లి గెడం నల్ల సూటు లోపల తెల్ల షర్ట్ వేసుకొని దాదాపుగా నటించిన ప్రతి సినిమాలోనూ బాస్ క్యారెక్టర్ పోషిస్తూ వచ్చాడు మేల్కొటే, ఈయన సినీ రంగ ప్రవేశం చాల విచిత్రంగా జరిగింది.
అప్పట్లో రామోజీ రావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకి చెందిన ఒక్క మార్కెటింగ్ యాడ్ తీస్తున్నాడు, ఇందులో ఆ సంస్థలో పని చేస్తున్న మేల్కొటే స్వయంగా నటించారు, అప్పట్లో రామోజీ రావు తానూ తీస్తున్న శ్రీవారికి ప్రేమ లేఖ సినిమాలో ఒక్క పాత్ర కోసం అన్వేషిస్తుండగా మేల్కొటే ని చూసిన వెంటనే ఈ పాత్రకి తగిన నటుడు ఈయనే అని తలచి స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచారు రామోజీ రావు గారు, అప్పుడే అక్కడకి వేటూరి సుందరరామూర్తి గారు వచ్చి మేల్కొటే ని పైన నుండి కింద వరుకు తీక్షణంగా చూసి ఇతనికి స్క్రీన్ టెస్ట్ లు ఏమి అక్కర్లేదు, రాత్రి భోజనానికి వస్తావా మందు వేద్దాం అంటూ సరదాగా మేల్కొటే తో మాట్లాడారు.
ఇక ఆ సినిమా తో ప్రారంభం అయినా మేల్కొటే సినీ ప్రయాణం 2018 వ సంవత్సరం లో విడుదల అయినా అరవింద సామెత వీర రాఘవ సినిమా వరుకు కొనసాగింది, సుమారు 180 సినిమాల్లో నటించిన మేల్కొటే ఒక్కటి రెండు సినిమాలు మినహా ప్రతి సినిమాలో బాస్ క్యారెక్టర్ లోనే నటించడం విశేషం, కంపెనీ లో బాస్ అంటే నిర్మాతలకు మొట్టమొదట గుర్తు వచ్చే పేరు మేల్కొటే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఆ స్థాయిలో ఈయన తనకంటూ ఒక్క బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు, సినిమాల్లోనే కాదండోదయి నిజాయ జీవితం లో కూడా మేల్కొటే హైదరాబాద్ కి చెందిన ఒక్క ప్రముఖ మార్కెటింగ్ కంపెనీ కి సీఈఓ గా పనిచేస్తున్నాడు, అంతే కాకుండా మేల్కొటే అల్లుడు ఎవరో కాదు బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ మరియు హైదరాబాద్ ఫేమస్ రంజీ ప్లేయర్ అయినా ఏం వీ శ్రీధర్, ఈయన ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ఈ విషయం ని అందరితో పంచుకున్నారు.
ఇక మేల్కొటే వ్యక్తిగత విషయానికి వస్తే రమా అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్న ఈయనకి ఒక్క కొడుకు మరియు ఒక్క కూతురు ఉన్నారు, కొడుకు అమెరికా లో ఒక్క పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అమెరికాలోని టాప్ 10 సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ లో ఒక్కరిగా పేరు గడించారు మేల్కొటే గారి అబ్బాయి , ఇక కూతుర్ని ఫేమస్ క్రికెటర్ అయినా ఏం వీ శ్రీధర్ కి ఇచ్చిఅంగరంగ వైభవంగా అప్పట్లో పెళ్లి చేసారు.
మేల్కొటే, అంతే కాకుండా హైదరాబాద్ లోని ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీ అయినా ఏం వీ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి కూడా ప్రస్తుతం సి ఈ ఓ గా కొనసాగుతున్నారు శ్రీధర్, ఈ కాలేజీ కి హైదేరాబద్ లో ఎలాంటి పేరు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వేలాది ఇంజనీరింగ్ కాలేజులలో టాప్ 10 లిస్ట్ తీస్తే అందులో ఏం వీ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కచ్చితంగా ఉంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇదండీ మేల్కొటే గారి హిస్టరీ, సినిమాల్లో కమెడియన్ అయినా నిజ జీవితం లో మేల్కొటే గారి రేంజ్ చూస్తుంటే సూపర్ గా అనిపిస్తుంది కదూ, అందుకే అంటారు డోంట్ జుడ్గే బుక్ బై కవర్ అని పెద్దలు.అయితే 2021 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన మేల్కొటే, ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటూ , అమెరికా లో స్థిరపడి తన వ్యాపారాలను చూసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.