Guess The Actor : కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అని పెద్దలు అంటూ ఉంటారు, దానికి లైవ్ ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.టాలెంట్ ఉండి కూడా సినిమా ఇండస్ట్రీ లో నెగ్గుకురాలేకపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన అధిక శాతం మంది పరిస్థితి ఇదే, కానీ టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా కలిసొచ్చి నేడు పాన్ ఇండియన్ స్టార్స్ రేంజ్ కి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

వారిలో ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఒకడు.రీసెంట్ గా ఈయన తన ప్రతిభ తో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు.క్రింద కనిపిస్తున్న ఈ ఫోటో చూసారా..?, ఇందులో సుకుమార్ పక్కన ఉన్న శ్రీకాంత్ ఓదెల ఆయనకీ అసిస్టెంట్ గా ఎన్నో సినిమాలకు పనిచేసాడు.అంతే కాదు, రంగస్థలం సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన వ్యక్తి కూడా ఈయనే.

రంగస్థలం సక్సెస్ మీట్ లో ఎదో ఒకరోజు వీడు పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఇది రాసి ఇస్తా అంటూ వేలాది మంది అభిమానుల సాక్షిగా చెప్పాడు.ఆయన చెప్పిన విధంగానే శ్రీకాంత్ ఓదెల నేడు తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకొని, ఇండస్ట్రీ లో దూసుకొచ్చాడు.కృషి మరియు పట్టుదల ఉంటే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని చెప్పడానికి రీసెంట్ క్లాసిక్ ఉదాహరణ ఇతనే.మొదటి సినిమాతోనే ఇంత మంచి గుర్తింపు ని దక్కించుకున్న ఈయన రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడో చూడాలి.
ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తో చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిలుస్తున్నాయి.రీసెంట్ గానే మెగాస్టార్ ని కలిసి ఆయన కోసం ఒక పవర్ ఫుల్ కథని వినిపించాడని, చిరంజీవి అందుకు ఎంతో మెచ్చుకొని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న వార్త.త్వరలోనే ఆయన నేటి తరం స్టార్ హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.