Gossips : తన గాత్రం తో కోట్లాది మంది భారతీయులను అలరించి, సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయకులతో ఒకరు రూప్ సింగ్ రాథోడ్. గజల్ గాయకుడిగా ఎన్నో వేల పాటలు పాడిన ఈయన తెలుగులో కూడా అనేక పాటలు పాడాడు. కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా, స్వరకర్తగా ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన ప్రముఖులలో ఒకడు ఆయన. అలాంటి లెజెండ్ కెరీర్ ప్రారంభం లో ఎంతో మంది ప్రముఖ సింగర్స్ వద్ద తబలా వాయించేవాడు .

వివిధ దేశాల్లో కూడా ఆయన ఎన్నో స్టేజి పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా రూప్ సింగ్ రాథోడ్ తన సొంత గురువు అనూప్ జలోటా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రూప్ సింగ్ రాథోడ్ ప్రముఖ సంగీత ద్వయం నదీమ్-శ్రవణ్, నేపథ్య గాయకుడు వినోద్ రాథోడ్, శ్రవణ్ రాథోడ్‌ల సోదరుడు. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ లో ఎదిగేందుకు ఏరోజు కూడా తన సోదరుల పేర్లను వాడుకోలేదు.
తన భార్యని పెళ్లి చేసుకున్నాడు అనే పగతో అనూప్ జలోటా తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి రూప్ సింగ్ ని ఇండస్ట్రీ నుండి బయటకి పంపేందుకు విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ టాలెంట్ ఉన్న వారిని ఎవ్వరు కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన ఆపలేరు అనడానికి ఉదాహరణ రూప్ సింగ్ రాథోడ్. అనూప్ జలోటా వద్ద రూప్ సింగ్ చాలా సంత్సరాలు శిష్యరికం చేసాడు.

సంగీతం లోని మెళుకువలు మొత్తం ఈయన వద్దనే రూప్ సింగ్ నేర్చుకున్నాడు. అలా జలోటా బృందం లో ఒకడిగా కొనసాగుతూ వచ్చిన రూప్ సింగ్, జోలాట భార్య సోనాలి సేత్ తో స్నేహం ఏర్పడిని. కొద్దిరోజులకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. అలా సాగిన వీళ్ళ ప్రేమాయణం పెళ్లి వరకు చేరింది. ఇది అనూప్ లవ్ స్టోరీ..వింటుంటే సినిమాటిక్ గానే ఉంటుంది కానీ , ఇలాంటి సంఘటనలు ఇది వరకు కేవలం మనం సినిమాల్లో చూసి ఉంటాం.
