Gosspis : ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటి వాటిని చాలా సాధారణంగా చేసేస్తున్నారు. దీనివల్ల పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టడం కంటే.. పెళ్లికి ముందే పిల్లలు పుడితే ఓ పని పూర్తవుతుందని వారు భావించినా.. ఒకరు వేసిన బాటలో పలువురు సెలబ్రిటీలు నడుస్తున్నారు. సినిమా పరిశ్రమలోనే కాదు బయట కూడా ఇదే సంస్కృతి కొనసాగుతోంది. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తప్పులు చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చుతున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమైపోయాయి. ఇంతకుముందు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలలో మాత్రమే ఇది జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటివి జరుగుతున్నాయి. గతంలో రేణు దేశాయ్ పెళ్లికి ముందే గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. అకీరా పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూడా అదే బాట పట్టారు.

ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఓ హీరోయిన్ కూడా అదే బాట పట్టిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ బ్యూటీ ఎన్టీఆర్ హీరోయిన్. మరి ఆ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.