Gossips : ఏంటి వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. ఆశ్చర్యకరంగా ఉన్నా.. మీరెంత నవ్వుకున్నప్పటికీ ఇదే నిజమంటున్నారు ఫ్యాన్స్. ఏంటి సినిమాల్లో అవకాశం రావడమే గొప్ప విషయం. ప్రస్తుతం సినిమాల్లోకి వస్తే టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండింటితో పాటు ఏమైనా చేయగలిగే ధైర్యం కూడా ఉండాలి. ఇక సినిమాల్లో హీరోయిన్ గా అడుగు పెట్టాలంటే సినిమా ఏదైనా చేసేలా మారిపోవాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎలాంటి సీన్స్ అయినా నటించగలగాలి .. బోల్డ్ సీన్స్ సైతం అవలీలగా నటించగలగాలి .. అప్పుడే స్టార్ హీరోయిన్ అవుతారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి మూడో సినిమాకే ఇండస్ట్రీకి టాటా చెప్పేసింది.

మొదటి రెండు సినిమాలలో చాలా పద్ధతిగా నటించిన ఈ అమ్మడు మూడో సినిమాలో దర్శకుడు లిప్ లాక్ సీన్స్ రాశారట. మొదట కథ చెప్పేటప్పుడు లిప్ లాక్ సీన్స్ పెట్టలేదట. క్యారెక్టర్ మధ్యలో లిప్ లాక్ సీన్స్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశాడట. దీంతో ముద్దుగుమ్మ లిప్ లాక్ సీన్స్ చేయడం అంటే భయపడిపోయి.. మాది మడి ఆచారం ఉన్న కుటుంబం అని చెప్పి.. తమ కుటుంబంలో ఇలాంటివి చేస్తే ఒప్పుకోరు అని ఏకంగా సినిమా ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పేసింది.

ప్రజెంట్ ఇప్పుడు ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలతో తన భర్తతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసేస్తోంది. అయితే ఈ హీరోయిన్ చేసిన పనిని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎవరికి పడితే వారికి ముద్దులు పెట్టడం కన్నా ఇలా వెనక్కి వెళ్లిపోయి లైఫ్ లో సెటిల్ అవ్వడమే మంచిది చాలా మంచి పని చేసావ్ అంటూ కొందరు పొగిడేస్తున్నారు.