గోపీచంద్ ‘రామ బాణం’ మొట్టమొదటి రివ్యూ..ఈసారి కూడా కష్టమేనా!

- Advertisement -

స్టార్ హీరో రేంజ్ ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు, అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకడు. ‘తొలివలపు’ అనే సినిమాతో హీరో గా వెండితెర అరంగేట్రం చేసిన గోపీచంద్, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో, మళ్ళీ ఆయన విలన్ రోల్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.

రామ బాణం
రామ బాణం

జయం, నిజం మరియు వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించిన గోపీచంద్, ఆ తర్వాత మళ్ళీ హీరో గా యజ్ఞం , రణం, లక్ష్యం, సౌర్యం, లౌక్యం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.అయితే గత కొంతకాలం నుండి గోపీచంద్ నటిస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

గోపీచంద్
గోపీచంద్

ఆయన చివరి చిత్రం ప్రముఖ దర్శకుడు మారుతీ తో చేసిన ‘పక్క కమర్షియల్’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆయన ‘రామబాణం’ అనే సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు.గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం మరియు లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ చిత్రాల తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది, రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు మరియు మీడియా మిత్రులకు వేశారు.

- Advertisement -

ఈ షో నుండి ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రొటీన్ స్టోరీ అయ్యినప్పటికీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సరిగ్గా కుదిరాయని, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు.కచ్చితంగా ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు.చూడాలి మరి రేపు ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి గోపీచంద్ కి భారీ హిట్ దక్కుతుందా,లేక నిరాశపరుస్తుందా అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here