Salaar Movie : ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడం ‘సలార్’ కి మాత్రమే జరిగింది. ఇన్ని రోజులకు తమ అభిమాన హీరో సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం, బంపర్ ఓపెనింగ్స్ దక్కడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

మొదటి రోజు టాక్, ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. టాక్ బాగుంది కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి ఆ మార్కుకి చేరుకుంటుందో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి ఒక్క హిట్ పడాలి అని కోట్లాది మంది అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ లో ఉన్న ఆయన మంచి కోరుకునే వాళ్ళు కూడా దేవుడికి మొక్కుకున్నారు. ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే అందులో గోపీచంద్ కచ్చితంగా ఉంటాడు. ఒకే తల్లి కడుపులో పుట్టకపోయిన కూడా వీళ్ళిద్దరూ అన్నదమ్ములు లాగ కలిసి ఉంటారు. ప్రభాస్ అంటే గోపీచంద్ కి ఎంత ఇష్టమో అని చెప్పడానికి ఇప్పుడు ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తున్నాము.

సలార్ సినిమా సూపర్ హిట్ అయితే కాలినడకన తిరుమలకి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకొని గుండు కొట్టించుకుంటాను అని గోపీచంద్ మొక్కుకున్నాడట. ఇప్పుడు సినిమా ఆయన అనుకున్న విధంగానే పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా అనుకున్న రేంజ్ కి వెళ్లి సూపర్ హిట్ అయితే గోపీచంద్ గుండు కొట్టించుకుంటాడో లేదో చూడాలి.