Geetha Madhuri : అవును, ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ను మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న గాయని గీతామాధురి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన గాత్రం.. అంతకు మించి హీరోయిన్లను తలదన్నే అందం. ఆమె పాడే పాటలు వింటున్నాకొద్ది వినాలనిపిస్తోంది. మెలోడీలు, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు, ఎలాంటి పాటలైనా ఆమె అవలీలగా పాడుతుంది.

ఆమె తన స్వరంతో మెస్మరైజ్ చేస్తుంది. గీతామాధురి అంత టాలెంటెడ్ సింగర్. గీతామాధురి బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో గీతా మాధురి తన భర్త నందు, కుమార్తె దాక్షాయినితో చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు తాను గర్భవతినని చెప్పింది. పైగా గీతామాధురి ఇంత మంచి విషయాన్ని ఎవరితోనూ ఎందుకు పంచుకోలేదని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే గీతా మాధురి వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరితోనూ పంచుకోలేదని జనాలు వ్యాఖ్యానిస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో తాను దాక్షాయనికి సోదరి రాబోతున్నదని గీత షేర్ చేసింది. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
