Singer Mangli : సింగర్ మంగ్లీ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సంగీతాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడతారు. ఇంత మందితో కనెక్ట్ అయినా ఈ బ్యూటీ మొదట జానపద పాటలతోనే గుర్తింపు తెచ్చుకుంది. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్‌ను రూపొందించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే బతుకమ్మ, సమ్మక్కసారక, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో పాటలు పాడి స్టార్ సింగర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఓ వైపు జానపద పాటలు, మరో వైపు భక్తిగీతాలు, సినిమా పాటలతో తన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.
ఇటీవల స్వధా ఫౌండేషన్ నిర్వహించిన మార్గ 2024 కార్యక్రమంలో ఉషా ఉతాఫ్, సుధా రఘునాథన్ వంటి స్టార్ సింగర్లతో కలిసి మంగ్లీ వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంగీత ప్రపంచంలో ఆమె సాధించిన ప్రతిభను గుర్తించిన అకాడమీ ఉస్తాది బిస్మిల్లాఖాన్ను యువ పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ విషయం వైరల్‌గా మారడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేవు. భవిష్యత్తులో మంగ్లీ ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఈ అవార్డు వచ్చినందుకు మరికొందరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇది ఇలా ఉంటే త్వరలోనే మంగ్లీ తన బావను పెళ్లి చేసుకుంటోన్నారని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్ అన్నీ పూర్తి చేసుకున్న తరువాత పెళ్లి పనుల్లో నిమగ్నం అవుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.