Golden Glob Award : తెలుగు సినిమా కీర్తిని మరోసారి విశ్వ వేదికపై చాటారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియాలో సూపర్ క్రేజ్ సంపాదించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సత్తా చాటింది. ఇప్పటికే ఈ మూవీ జపాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వారితో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా జక్కన్న మూవీ టేకింగ్‌కు ఫిదా అయ్యారు.
విజువల్ వండర్‌గా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ ఈ మూవీ మెప్పించింది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైంది ఈ సినిమా. ఈ మూవీతో ఒక్కసారిగా జక్కన్న పేరు వరల్డ్ సినిమాలో వినిపించడం మొదలైంది. అంతే కాకుండా ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్లుగా మారిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తన సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ మూవీ మరో విశిష్ఠ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్’ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది. ఈ మేరకు బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు.
‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కీరవాణి అవార్డు అందుకునేటప్పుడు చిత్ర బృందమంతా కేరింతలు కొట్టింది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి ఇదంతా తన మొబైల్లో చిత్రీకరించింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. విశ్వ వేదికపై తమ ఫేవరెట్ హీరోల సాంగ్ అవార్డు అందుకోవడంతో ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ప్రముఖ సినీ నటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
https://twitter.com/DVVMovies/status/1612989314564227072?cxt=HHwWgIDQkYrPvuIsAAAA
అవార్డు స్వీకరించిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆ తర్వాత కాసేపు మాట్లాడారు. “గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు నా సోదరుడికి దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగింజ్‌కు ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చినవారిని నమ్ముకున్నా. పాటకు కాళభైరవ అద్భుత సహకారం అందించాడు. ఈ అవార్డ్ ఇచ్చిన జ్యూరీకి కృతజ్ఞతలు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ సినీ వేదికపై మరెన్నో పురస్కారాలు అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.” అని కీరవాణి మాట్లాడారు.