Pushpa 2 : నీయవ్వ తగ్గేదేలే.. ట్రోల్ చేస్తే నాకేంటి.. నారేంజ్ ఇది అంటున్న అల్లు అర్జున్

- Advertisement -

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆయన హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ గురయ్యారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే సాంగ్ ప్రోమో జనాలకు పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టింది. కొందరు అభిమానులు ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అయితే కావాలనే అల్లు అర్జున్ అంటే పడని వారు కొందరు ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓహ్ సినిమాకి కూడా రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం అవసరమా అంటూ వెటకారంగా ఆయనను వెక్కిరిస్తున్నారు.

ఈ ట్రోలింగ్ అల్లు అర్జున్ వద్దకు చేరింది. దీంతో కోపంతో బన్నీ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ వరకే తీసుకోవాలంటూ డిసైడ్ అయ్యారట. కానీ ఎప్పుడైతే ఆయనపై ట్రోలింగ్ పెద్దగా జరుగుతుందో.. తనను తక్కువ చేసిన వల్గర్ కామెంట్స్ చేస్తున్నారో తెలుసుకుని.. బన్నీ అమాంతం రెమ్యూనరేషన్ పెంచేసాడట. సినిమా కోసం రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ఓ ఏరియా షేర్ కూడా అడిగారట .

- Advertisement -
pushpa 2
pushpa 2

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అడిగి అడగగానే మేకర్స్ కూడా స్టైలిష్ స్టార్ డెసిషన్ ను ఓకే చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అంటున్నారు. మరికొందరు అదేంటి వాళ్లు ఎవరో ట్రోలింగ్ చేస్తే సడన్ గా పారితోషకం పెంచడం కరెక్టేనా..?.. ఎంత పాన్ ఇండియా హీరో అయితే మాత్రం నిర్మాతలను అర్థం చేసుకోకూడదా.. ఒకరి మీద కోపంతో ఇలాంటి నిర్ణయం కరెక్టేనా అంటూ మరోసారి బన్ని ని ట్రోల్ చేయడం ప్రారంభించారు . దీంతో బన్నీ ఫ్యాన్స్ అలాంటి వాళ్లకు ఇచ్చి పడేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం ఆగస్టు 15వ తేదీ బొమ్మ దద్దరిల్లిపోవడం పక్కా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here