Geetu Royal : బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఏమో గానీ జంటల మధ్య చిచ్చు పెట్టడంతో విడగొట్టిందనే విమర్శలను అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సీజన్ లో బాగా పాపులర్ కంటెస్టెంట్స్లో గీతూ రాయల్ ఒకరు. చిత్తూరు చిరుతగా ఫేమస్ అయిన గీతూ తన మార్క్ గేమ్, యాటిట్యూడ్, మాటలతో ఆకట్టుకున్నారు.. హౌస్ లో ఉన్నంత కాలం ఆమె అందరిని ఓ ఆట ఆడుకోవడం మాత్రమే కాదు.. జనాలను అల్లరించింది.. అనుకోని రీతిలో ఎలిమినేట్ అయ్యింది..
అయితే గీతూ ఇంటర్వ్యూ లు ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు..మొన్నీమధ్య ఓ ఇంటర్వ్యూలో గీతూ రాయల్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో నాకు హెల్త్ బాలేని సమయంలో బాత్రూమ్ లు కడిగి ఆదిరెడ్డి సహాయం చేశాడని అలా ఆదిరెడ్డి చేసిన సహాయం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహం బలపడిందని గీతూ చెప్పింది.. బిగ్ బాస్ హౌస్ లో నేను ఆదిరెడ్డి చెవి పిసికానని అయితే ఆదిరెడ్డితో అలా చేయడంతో ఆడియన్స్ ఏ విధంగా ఫీలవుతారో అని నాకు అనిపించిందని గీతూ అన్నది… ఆదిరెడ్డి భార్య పల్లెటూరి అమ్మాయి అని గీతూ తెలిపారు.
అలాగే నేను ఆదిరెడ్డితో సన్నిహితంగా మెలగడంతో ఆమె ఇన్ సెక్యూర్ గా ఫీల్ కావడం జరిగిందని గీతూ కామెంట్లు చేశారు. గ్రామాల్లో ఉండేవారికి, టవున్ లో ఉండేవారికి ప్రవర్తనలో తేడా ఉంటుందని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. దీని గురించి ఆదిరెడ్డికి మందు పెట్టానని బిగ్ బాస్ ను అడిగావా అని కవితను అడిగానని అయితే ఆమె మాత్రం తాను అలా అనలేదని చెప్పిందని గీతూ రాయల్ పేర్కొన్నారు.. బిగ్ బాస్ షో సీజన్6 ఫ్లాప్ కావడానికి నేను కారణమని ఎవరైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ అభిప్రాయాన్ని మాత్రం అంగీకరించనని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు. గీతూ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… మొత్తానికి ఇద్దరి మధ్య ఏం లేదని క్లారిటీ వచ్చింది..