Geetha Singh : కొంతమంది నటీనటులు ఒకప్పుడు లావుగా ఉండడాన్ని చూసి వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ ప్రముఖ దర్శకులు సినిమాలు తీసి కామెడీ రప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు .అలాంటి వారిలో ఈవీవీ సత్యనారాయణ కూడా ఒకడు. ఈయన ఇండస్ట్రీ కి ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను పరిచయం చేసారు. వారిలో కొంతమంది ప్రస్తుతం టాప్ కమెడియన్స్ గా కొనసాగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది టాప్ కమెడియన్స్ కాకపోయినప్పటికీ వాళ్లకి జీవితాంతం గుర్తునిపొయ్యే పాత్రలను ఇచ్చారు.అలాంటి వారిలో ఒకరు గీత సింగ్.అల్లరి నరేష్ ని హీరో గా పెట్టి ఈవీవీ తీసిన ‘కితకితలు’ అనే చిత్రం ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నరేష్ భార్య గా నటించిన ‘గీతా సింగ్’ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా.కేవలం ఈ సినిమా కోసమే లావుగా ఉన్న అమ్మాయిల కోసం రాష్ట్రం మొత్తం గాలించి ఎన్నో ఆడిషన్స్ చేసి చివరికి గీతా సింగ్ ని తీసుకున్నారు.

ఈ చిత్రం లో డైరెక్టర్ ఆమె పై చేసిన బాడీ షేమింగ్ చూస్తే అయ్యో పాపం అని మనకే అనిపిస్తాది, కానీ రాకరాక వచ్చిన సినిమా అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక గీతా సింగ్ తనని ఎంత బాడీ షేమింగ్ చేస్తూ చూపించినా కూడా ఫీల్ అవ్వలేదు.ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో గీతా సింగ్ కి వరుసగా 20 సినిమాల్లో కమెడియన్ గా నటించే అవకాశం దక్కింది.ఆ విధంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న గీతా సింగ్ అందరూ ఆశ్చర్యపొయ్యేటట్టు సన్నగా మారిన ఫోటోలు సోషల్ మీడియా లో కొంతకాలం క్రితం వైరల్ గా మారాయి.అందులో ఒకటి మీకోసం క్రింద ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.ఇందులో మనం చూస్తున్న గీతా సింగ్ ఒకప్పుడు ‘కితకితలు’ సినిమాలో చేసిన గీతా సింగ్ నేనా అని అనిపిస్తుంది కదూ..అంతటి భారీ కాయాన్ని ఇంత నాజూగ్గా మల్చుకున్న గీతా సింగ్ కృషి ని ప్రశంసించక తప్పదు.

అయితే గత కొంతకాలం గా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా గీతా సింగ్ ప్రస్తుతం కర్ణాటక ప్రాంతం లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. ఈమెకి పెళ్లి కాలేదు కానీ, తన సోదరుడి ఇద్దరి కుమారులను దత్తత తీసుకొని పెంచుకుంటుంది.అయితే పెద్ద కుమారుడు రీసెంట్ గానే రోడ్డు ప్రమాదం లో చనిపొయ్యాడట. ఈ విషయాన్నీ ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు కరాటీ కళ్యాణి సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న తన కుమారుడు ఇలా చనిపోవడం తో ఆమె మానిసికంగా ప్రస్తుతం ఎంతో కృంగిపోయిందట.ఆమె ఈ బాధ నుండి త్వరగా తేరుకోవాలని, పెద్ద కుమారుడి ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.