Gayathri Gupta : సినిమా ఇండస్ట్రీ లో పని చేసే ఆర్టిస్ట్స్ జీవితాలు ఎంతో లగ్జరీ గా ఉంటాయి అనుకుంటే పెద్ద పొరపాటే. పెద్ద పెద్ద స్టార్స్ కి సైతం చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. సూపర్ స్టార్స్ సైతం ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేక, సరైన వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అలాగే ఆకలి తో అలమటించి , చెయ్యి చాచి ఒకరిని డబ్బులు అడగలేక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఇండస్ట్రీ లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు సరైన సమయం లో సంపాందించి సహాయం చెయ్యడం లేదో ఎవ్వరికీ అర్థం. ఇప్పుడు ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ ‘గాయత్రీ’ కూడా ఇదే పరిస్థితి ని ఎదురుకుంటుంది.

గాయత్రీ అంటే మనకి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఆమె ముఖం చూస్తే ఎవరైనా గుర్తు పట్టగలరు. ఈమె సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ‘ఫిదా’ చిత్రం లో సాయి పల్లవి కి స్నేహితురాలి పాత్రని పోషించింది. కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, ఐస్ క్రీం 2 , మిఠాయి , అమర్ అక్బర్ ఆంటోనీ మరియు కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఈ సినిమాలు ఆమెకి ఎలాంటి గుర్తింపు ని తీసుకొని రాలేదు, కేవలం ఫిదా చిత్రం మాత్రమే ఈమెకి గుర్తింపు ని తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈమె ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈమెకి ఆర్థరైటిస్ అనే వ్యాధి సోకిందట. డిప్రెషన్ లో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది అట.

ఈ వ్యాధికి చికిత్స ఉంది, కానీ డబ్బులు 12 లక్షల రూపాయిల వరకు అవసరం ఉంటుంది. తనకి సహాయం చేయాల్సిందిగా గాయత్రీ సోషల్ మీడియా ద్వారా అర్థించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం తో వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ గాయత్రీ కి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఒక లక్ష 50 వేలు మాత్రమే సమకూరింది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తనకు తోచిన సహాయం చేసి ఆదుకున్నాడు. ఈ విషయం సాయి పల్లవి కి తెలిస్తే కచ్చితంగా ఆమె సహాయం చేస్తుందని అంటున్నారు. ఈ వార్త వైరల్ అయ్యి ఆమెకి చేరితే బాగుండును అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.