Bigg Boss Telugu 7 : శివాజీ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గౌతమ్ తల్లి.. పాపం పరువు పోయిందిగా!

- Advertisement -

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో పెద్ద మనిషి తరహా పాత్ర పోషిస్తున్న కంటెస్టెంట్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శివాజీ. ఈయన హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరకు ఆయన చేసిందే కరెక్ట్, తన వల్లే బిగ్ బాస్ హౌస్ నడుస్తుంది అనే రేంజ్ లో ఆయన జనాలకు ప్రాజెక్ట్ చేసాడు.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే ప్రశాంత్ మరియు యావర్ లాంటి కంటెస్టెంట్స్ ని తన గుప్పిట్లో ఉంచుకొని ఆయనకి ఎదురు సమాధానం చెప్పలేని విధంగా, తన బానిసలు లాగా మార్చేసుకున్నాడు అనేది నెటిజెన్స్ అభిప్రాయం. ఇకపోతే శివాజీ ని ఎవరైనా నామినేషన్స్ వేస్తే అసలు తీసుకోడు అని. అతని అసలు రంగు అప్పుడే బయటపడుతుంది అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది.

Gautam shivaji

కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. ఈరోజు గౌతమ్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆమెకి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆమె హౌస్ లో అందరితో వ్యవహరించిన తీరు అందరికి బాగా నచ్చింది. ఈమెని చూసి తన అమ్మని గుర్తు చేసుకొని ఏడుస్తున్న యావర్ ని దగ్గరకి తీసుకొని, నన్ను కూడా మీ అమ్మ లాగానే అనుకో, మా ఇంటికి వచ్చి పోతుండు అని అంటుంది.

- Advertisement -
gautam mother yawaar

ఇదంతా పక్కన పెడితే ఆమె బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో కాసేపు సరదాగా మాట్లాడుతున్న సమయం లో గౌతమ్ కెప్టెన్సీ గురించి చర్చకి వచ్చింది. నేను ఇవ్వబట్టే నీకు కెప్టెన్సీ వచ్చింది అని శివాజీ గౌతమ్ తో అనగా, అందరూ ఒక నిర్ణయం కి రాబట్టే వచ్చింది, కేవలం మీ ఒక్కరి వల్లే వచ్చినట్టు చెప్తున్నారు ఏమిటి అని అంటుంది. ఆ సమయం లో శివాజీ నోటి నుండి మాట రాలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here