Game Changer : విడుదలకు ముందే ఓటీటీలోకి ‘గేమ్ చేంజర్’..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే అప్డేట్!

- Advertisement -

Game Changer : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో అతి ముఖ్యమైన రెండేళ్ల సమయాన్ని ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం కేటాయించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రం పై ప్రారంభం లో మంచి క్రేజ్ ఉండేది. కానీ మార్కెట్ లో ఇప్పుడు ఈ సినిమాపై ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ లేకపోవడం గమనార్హం. అందుకు కారణం కూడా లేకపోలేదు. శంకర్ నుండి రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడమే అందుకు కారణం. ఈ సినిమాలో టేకింగ్ పరంగా కూడా శంకర్ ప్రేక్షకులను అవాక్కు అయ్యేలా చేసాడు.

Game Changer
Game Changer

అందుకే ‘గేమ్ చేంజర్‘ చిత్రానికి ఒకప్పుడు వచ్చిన ఫ్యాన్సీ రేట్లు ఇప్పుడు రావడం లేదట. అయితే శంకర్ ప్రొమోషన్స్ లో మాస్టర్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. టీజర్ దగ్గర నుండే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఆయన మార్కెటింగ్ స్టైల్ ఇప్పటికీ కూడా ఏ డైరెక్టర్ కి సాధ్యం కాలేదు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ప్రొమోషన్స్ తన వింటేజ్ మార్కు ని కనపడేలా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. అందులో భాగంగా ఈ సినిమా మేకింగ్ పై ఒక డాక్యుమెంటరీ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారట. ఈ డాక్యుమెంటరీ ని ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫిల్క్స్’ స్ట్రీమింగ్ చెయ్యబోతుందట.

Game Changer: Ram Charan To Play Not Double But Triple Role In The Film? [Fact Check]

- Advertisement -

రీసెంట్ గానే వీళ్ళు రాజమౌళి కి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ వీడియో ని విడుదల చెయ్యగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శంకర్ వంతు వచ్చేసింది. ఈ డాక్యుమంటరీ లో సినిమాకి సంబంధించిన మాకింగ్స్ షాట్స్ తో పాటుగా రామ్ చరణ్, శంకర్, కియారా అద్వానీ స్పెషల్ చిట్ చాట్స్ కూడా ఉంటాయట. అలా ‘గేమ్ చేంజర్’ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే ముందే ఓటీటీ ఆడియన్స్ ని పలకరించబోతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Game Changer song Jaragandi: Ram Charan and Kiara Advani dance their hearts out in foot-tapping track. Watch - Hindustan Times

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here