Gabbar Singh టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గత రెండు మూడేళ్ళ నుండి ఏ స్థాయిలో కొనసాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకానొక దశలో ఈ రీ రిలీజ్ చిత్రాలు కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసే స్థాయిలో ఉన్నింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు సంచలనాలు సృష్టించాయి. అత్యధిక రికార్డ్స్ వీళ్లిద్దరి మధ్యనే ఉన్నాయి. అయితే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఏ సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు అని అభిమానులు నిన్న మొన్నటి వరకు కొంతమంది ప్రముఖులను ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు.

బద్రి సినిమాని రీ రిలీజ్ చేస్తారని అందరూ భావించారు కానీ, గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టు నేడు అధికారిక ప్రకటన వచ్చింది. అను శ్రీ సంస్థ ఈ సినిమా సెప్టెంబర్ 2 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రాన్ని అభిమానులు పలు సందర్భాలలో స్పెషల్ షోస్ వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా భారీ గ్రాండ్ రీ రిలీజ్ చెయ్యలేదు. ఎన్ని సార్లు ఈ చిత్రానికి స్పెషల్ షోస్ వేసినా అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యేవి. ఈసారి భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ఖుషి. 2022 డిసెంబర్ 31 వ తారీఖున రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి దాదాపుగా 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా ఈ రెకార్డుకి దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ అయినా ఈ రికార్డు ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.