Thalaivar 170 : రజినీకాంత్ కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదం.. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న స్టార్ హీరోయిన్!

- Advertisement -

Thalaivar 170 : కిక్ బాక్సర్ గా ప్రసిద్ధి గాంచిన రితికా సింగ్ విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘గురు’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కిక్ బాక్సింగ్ లో అత్యుత్తమ ప్లేయర్ గా కొనసాగుతున్న రోజుల్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీ ని ఎంచుకోవడం, అందులోనే కొనసాగడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పరిస్థితి. కానీ ఆ రిస్క్ చేసి ఆమె సినీ రంగానికే ప్రాధాన్యత ఇచ్చింది.

Thalaivar 170
Thalaivar 170

కిక్ బాక్సింగ్ ని పూర్తిగా వదిలేసింది. ప్రారంభం లో ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులు రావడం తో ఈమెకు సౌత్ లో అవకాశాలు రావడం బాగా తగ్గిపోయింది. అవకాశాలు తగ్గుతున్న సమయం లో ఆమెకి సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించే ఛాన్స్ రావడం చిన్న విషయం కాదు. ఈ సినిమా హిట్ అయితే రితికా సింగ్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుంది.

అయితే ఈమెకి షూటింగ్ స్పాట్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదం వల్ల ఆమె చేతులకు గాయాలు అయ్యాయి. ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్న రితికా సింగ్, గాజు అడ్డం అదుపు తప్పి ఆమె చేతి మీద పడడం వల్ల చెయ్యి మొత్తం గాయాల పాలై రక్తపు మరకలతో నిండిపోయింది. రితికా కి అలా గాయాలు అవ్వడం తో మూవీ యూనిట్ ఆమెకి సెలవు ప్రకటించింది.

- Advertisement -

ఆమె లేని కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ రితికా సింగ్ ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుంది?, ఫైట్ సన్నివేశాలు చేస్తుందంటే నెగటివ్ రోల్ లో కనిపించబోతుందా?, లేదా పోలీస్ పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా, మంజు వారియర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here