ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేస్తే గానీ పాపులారిటీ.. కొంత మందికి మాత్రం ఒక్క సినిమాతోనే వస్తుంది. ఇలా ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు తిప్పుకున్న నటీ, నటులు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒకరు. ఇక అభిమానులు ఆమెను ముద్దుగా చిట్టీ అని పిలుచుకుంటారు. జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పరిశ్రమ చూపు మెుత్తం తనవైపు తిప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే డ్యాన్స్ కు ఫిదా కానీ అభిమానులు ఉండరు. ఇక తాజాగా తన హాట్ హాట్ అందాలతో, డ్యాన్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.

అయితే ఈ ముద్దగుమ్మ మాత్రం తన బెల్లీ డ్యాన్స్ తో, హాట్ హాట్ డ్యాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన హాట్ లుక్స్‌తో ట్రెండీగా డ్యాన్స్ చేసి కుర్రాళ్ల మతిపోగొట్టింది. ఫ్యాషనబుల్ చీరకట్టులో థైస్ అందాలతో ఆందరినీ ఆకట్టుకుంది. వగలుపోతూ ర్యాంప్ వాక్ చేసింది. తనతో పాటు మోడల్స్‌నూ కూడా కాలు కదిపేలా చేసింది. ఈ లుక్ లో చిట్టీ పిచ్చ హాట్ గా ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు అనే ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని మెుత్తం తనవైపు చూసేలా చేసుకుంది. దాంతో ఈ అమ్మడుకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరు భావించారు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఓ చిన్న పాత్రంలో మెరింది. ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత వచ్చిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో చేతిలో ఒక్క సినిమా లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది చిట్టి.