Big Boss : ఈ వారం ఫ్యామిలీ వీక్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ముఖ్యంగా హౌస్ లో మొదటి నుండి చూడ ముచ్చటగా అనిపించినా అమర్ దీప్ మరియు ప్రియాంక స్నేహం కి బ్రేక్ పడినట్టుగా అర్థం అవుతుంది. ప్రియాంక కాబొయ్యే భర్త అమర్ దీప్ కి దూరం గా ఉండమని హింట్ ఇవ్వడం, అలాగే అమర్ దీప్ భార్య తేజస్విని ప్రియాంక కి దూరం గా ఉండు అని పరోక్షంగా హింట్ ఇవ్వడం కారణంగా అమర్ దీప్ మరియు ప్రియాంక అలెర్ట్ అయ్యారు.

నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్ ప్రియాంక ని తనకి సహాయం చెయ్యమని అడగలేదు. అలాగే ప్రియాంక కూడా శివాజీ కి నిన్న కెప్టెన్సీ టాస్కులో సహాయం చేసింది. చూస్తూ ఉంటే ఆమె అమర్ దీప్ నుండి దూరం గా జరగడానికి ప్రయత్నాలు చేస్తుంది అనే విషయం అర్థం అవుతుంది. వచ్చే వారం లో వీళ్లిద్దరి మధ్య గొడవలు కూడా రావొచ్చు.

ఇదంతా పక్కన పెడితే మొదటి వారం నుండి పల్లవి ప్రశాంత్ తో గొడవపడుతూ వచ్చిన అమర్ దీప్, ఈ వారం లో బాగా దగ్గర అయ్యాడు. ఒకసారి కెప్టెన్ అయిన వారిని మళ్ళీ కెప్టెన్ అవ్వనివ్వను అని భీష్మించి కూర్చున్న అమర్, ప్రశాంత్ విషయం లో మాత్రం నీకు కచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని మాట ఇచ్చాడు. నిన్న కెప్టెన్సీ టాస్కులో ప్రశాంత్ ని తన బొమ్మ పట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసాడు అమర్.

అప్పుడు ప్రశాంత్ శివాజీ అన్న నాకోసం లెటర్ త్యాగం చేసాడు అన్న, ఇప్పుడు ఆయనకీ నాకు సహాయం చేసే అవకాశం వచ్చింది, అందుకే ఆయనకీ సపోర్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను, ఏమి అనుకోకు అన్నా అని అన్నాడు. అప్పుడు అమర్ దీప్ పర్లేదు రా, నువ్వు దాంట్లో న్యాయం ఉంది అని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు. టాస్కు అయిపోయిన తర్వాత మరోసారి ప్రశాంత్ అమర్ దీప్ కి క్షమాపణలు చెప్పి కౌగిలించుకోవడం, అమర్ దానికి ఇచ్చిన రెస్పాన్స్ ఇవన్నీ చూసేందుకు ఎంతో చక్కగా అనిపించింది.
