Mrunal Thakur : నువ్వు అలాంటి డ్రెస్సులు వేసుకోకు… చూడలేకపోతున్నాం అంటూ మృణాల్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

- Advertisement -

Mrunal Thakur : గత ఏడాది సీతారామంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మిగా కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. ఒక్క సినిమాతోనే అమ్మడు హాట్ ఫేవరేట్ అయిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న కూడా మంచి విజయాన్ని అందించింది. హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనుకున్న టైంలో విజయ్ దేవరకొండతో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన డిజాస్టర్ షాక్ అంతా ఇంతా కాదు. దెబ్బకు అమ్మడికి ఆఫర్లు ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమ్మడు జోరు కాస్త తగ్గించింది.

కానీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకుంటూ టచ్ లోనే ఉంటుంది. దాంతో పాటు.. ఒక్కోసారి బోల్డ్ ఫొటో షూట్‌లతో దర్శనమిచ్చి కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ‘మరీ ఇంత బోల్డ్ తట్టుకోలేకపోతున్నాం’ , ‘మీరు నా ఆరాధ్యదైవం.. ప్లీజ్ ఇలాంటి ఈ బట్టలు వేసుకోకండి’ అంటూ కామెంట్స్ ఇస్తున్నారు.

- Advertisement -

ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత మృణాల్ తెలుగులో ప్రభాస్ సరసన సినిమాకు కమిట్ అయ్యారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మిలిట్రీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు మృణాల్ ను ఫిక్స్ చేశాడట దర్శకుడు. త్వరలో కాంచన 4లో కూడా నటించనుంది. రాఘవ లారెన్స్ హీరోగా, దర్శకుడిగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెరీర్లో తొలిసారి మృణాల్ హర్రర్ సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Rahul Jhangiani (@rahuljhangiani)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here