Urfi Javed : నటి, బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఇక ఆమె వేసుకునే డ్రెస్సులు, అవుట్ ఫిట్స్ కొన్ని సార్లు వివాదంగా మారుతుంది. ఆమె ధరించే డ్రెస్సులపై కొంత మంది ఫైర్ అవుతుంటారు. కొన్ని సార్లు రెస్టారెంట్లలోకి అనుమతించరు. ఎయిర్ పోర్ట్ వద్ద సాధారణ వ్యక్తులు ఆమెను నిలదీస్తుంటారు.

అలా ఉర్ఫీ జావెద్ ఎప్పుడూ ఏదో ఒక రకమైన కాంట్రవర్సీతో వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఉర్ఫీ జావెద్ ఇప్పుడు ఓ అమానుష ఘటన మీద స్పందించింది. ఓ ఇంటర్నేషనల్ బైక్ ట్రావెలర్ మీద జరిగిన అత్యాచర ఘటన మీద స్పందించింది. దాదాపు 153 దేశాలు తన భర్తతో కలిసి బైక్ మీద ట్రావెల్ చేసిన స్పానిష్ మహిళను.. మన దేశంలోని జార్ఖండ్‌లో రేప్ చేశారు. ఈ దారుణమైన ఘటన మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. పలువురు సెలెబ్రిటీలు సైతం ఈ ఘటన మీద స్పందిస్తున్నారు. ఓ భారతీయురాలిని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.

వారిద్దరూ 153 దేశాలు తిరిగారు. ఇండియాలో ఇలా ఆమెను రేప్ చేశారు. ఇది చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంటూ ఉర్ఫీ జావెద్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీంతో మొదట సారి నెజిజన్తు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు. సింగర్ చిన్మయి కూడా ఈ విషయం మీదే స్పందించింది. ఇండియాలో ఆడవాళ్లకు రక్షణ లేదు అనే మాటకు ఈ ఘటన ఒక నిదర్శనంగా చూపించింది. అరబ్ కంట్రీస్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లోనూ ఆ జంట తిరిగింది. కానీ ఇండియాలో మాత్రం ఆమెకు రక్షణ లేదు అంటూ చిన్మయి వదిలిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.